Oct 29,2023 21:32

ప్రజాశక్తి - వీరవాసరం
యునైటెడ్‌ కాపు సర్వీస్‌ క్లబ్‌ ఒక్క కాపు సామాజిక వర్గానికి కాకుండా ఇతర సామాజిక వర్గాల ప్రజలకు తమ సేవలు అందజేస్తున్నారని క్లబ్‌ ప్రతినిథులు అన్నారు. క్లబ్‌ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుపై శిక్షణ ఇచ్చి ఆదివారం కుట్టు మిషన్లు ఉచితంగా అందజేశారు. అనంతరం కాపు క్లబ్‌ మండల అధ్యక్షుడు గుండా రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యునైటెడ్‌ కాపు క్లబ్‌ ఇంటర్‌ నేషనల్‌ గబర్నర్‌ డా.ముచ్చర్ల సంజరు మాట్లాడారు. సమాజాభివృద్ధి కోసం ఈ సంస్థలను స్థాపించినట్లు తెలిపారు. అన్ని ఇంటర్‌నేషనల్‌ క్లబ్‌ల బైలా నుంచి అంశాలను తీసుకుని ఈ క్లబ్‌కు బైలాను రూపొందించడం జరిగిందన్నారు. సమాజం పట్ల గౌరవం సామాజిక స్పూర్తితో సేవలందించడం జరుగుతుందన్నారు. భీమవరం బార్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు మొగళ్ల వెంకటరమణను క్లబ్‌ తరుపున సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఒక మహిళ ఎంతో శక్తిమంతమైన పాత్ర పోషిస్తుందన్నారు. అటువంటి మహిళలకు ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా క్లబ్‌ అభివృద్ధికి రూ. పది వేలు విరాళం ప్రకటించారు. అనంతరం యాభై మంది మహిళకు కట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి గుండా జయ ప్రకాష్‌నాయుడు, వైస్‌ ఎంపిపి అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, ఎంపిటిసి కొల్లేపర శ్రీనివాసరావు, జవ్వాది దాశరథి శ్రీనివాస్‌, రావూరి అప్పారావు, పోకల రాములు పాల్గొన్నారు.