Jan 05,2023 22:44

ప్రజాశక్తి - ముదినేపల్లి
             మండలంలోని పెదపాలపర్రులో గంటా వెంకటరమణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గురువారం పెదపాలపర్రులోని వంద మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ ఛైర్మన్‌ గంటా కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ తన తండ్రి పేరు మీద ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ఎనిమిదేళ్లు పూర్తి అయిందన్నారు. తనతండ్రి గంటా వెంకటరమణ ఆశయాలు, ఆలోచనల ప్రేరణతో సమాజ ప్రగతికి, ప్రజల సంక్షేమం, పేద విద్యార్థుల అభ్యున్నతికి ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో బాగంగా స్థానికంగా ఉన్న రెండు పాఠశాలాల విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు, నోట్‌ పుస్తకాలు, స్టడి మెటిరీయల్స్‌ను ప్రతి ఏటా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గంటా రాకేష్‌కుమార్‌, గ్రామప్రముఖులు పాల్గొన్నారు.