Feb 15,2023 22:39

ప్రజాశక్తి-నందిగామ 

ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదానికి కూతవేటు దూరంలో దళిత మహిళ ఎస్తేరు రాణి హత్యపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల నేతలు, స్థానిక తెదేపా నేతలతో కలిసి ఆర్డిఓ రవీంద్రబాబుకి వినతిపత్రం బుధవారం అందజేశారు. అనంతరం సౌమ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నివాసంకి అత్యంత దగ్గరలో ఇలాంటి సంఘటన జరగడం దారుణం అన్నారు. అందులో ఒక మహిళ హౌమ్‌ మంత్రి గా ఉన్న ఈ రాష్ట్రంలో దాదాపు 500 పైగా మహిళలు ముఖ్యంగా దళిత,బీసీ,మైనారిటీ మహిళల మీద దాడులు జరిగితే ఒక్క సంఘటన లో అయినా చర్యలు తీసుకోక పోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హౌదాలోన తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.