ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రకటించిన మహాశక్తి పథకం ద్వారా మహిళలకు అద్భుతమైన లబ్ధి చేకూరుతుందని తెలుగు మహిళా విభాగం పార్లమెంటరీ నాయకురాలు పల్లం సరోజిని అన్నారు. మంగళవారం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ వేగేశన నరేంద్రవర్మ సూచనల మేరకు బాపట్ల నియోజకవర్గ మహిళా నాయకుల ఆధ్వర్యంలో బాపట్ల పట్టణ 11వ వార్డులో మహాశక్తి టీం మహిళలు ఇంటింటికీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పల్లం సరోజిని మాట్లాడారు. కార్యక్రమంలో బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, యూనిట్ ఇన్‌చార్జ్ సూరగాని శేఖర్, మన్నెం వెంకటస్వామి, ఉప్పాల శ్రీను, మన్నెం చంద్రమౌళి, తెలుగు మహిళా నాయకులు చెన్నుపాటి హైమావతి, వేమవరపు సుజాత, ఝాన్సీరాణి, దగ్గమల్లి రాణి, రజిని, పద్మ, రమాదేవి, నజ్మ, తాతా జయమ్మ, బడుగు గోపమ్మ, కర్రి యోగేశ్వరి, పద్మ, మహిళలు పాల్గొన్నారు.










