వేంపల్లె : మహిళల సంక్షేమానికి సిఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపిపి లక్ష్మి గాయత్రి చెప్పారు. స్థానిక గరుగువీధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం గర్భిణులు, బాలింతలకు వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, పిల్లల పోషకాహారంపై ప్రత్యేకశ్రద్ధ చూపిస్తోందన్నారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణలో భాగంగా పౌష్టికాహారం. రేషన్ పంపిణీ చేయడం శుభపరి ణామమన్నారు. గత ప్రభుత్వాలు మహిళా సంక్షేమానికి కృషి చేయలేదని చెప్పారు. సమావేశంలో ఎంపిడిఒ మల్లికార్జునరెడ్డి, తహశీల్దార్ చంద్రశేఖ ర్‌రెడ్డి, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ చెరసాల యోగాం జనేయులు, సిడిపిఒ సూపర్ వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, బాలితలు పాల్గొన్నారు.
ముద్దనూరు : గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా ఇంటికే రేషన్ సరుకులు అందిస్తున్నారని ముద్దనూరు సర్పంచ్ బోనం సరళ, వైస్ ఎంపిపి పుష్పలత అన్నారు. స్థానిక ప్రాథమిక స్టేషన్ స్కూల్ ఆవరణలో బుధవారం సిడిపిఒ ముంతాజ్ బేగం ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ రేషన్, తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఒ ముంతాజ్ బేగం, ఎంపిడిఒ సూర్య నారాయణరెడ్డి మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు సాంబశివారెడ్డి, సూప ర్‌వైజర్లు ప్రవీణ, ఉమారాణి, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
చాపాడు : గర్భిణులు, బాలింతలకు రక్తహీనత సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం సరఫరా చేస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీతారామపురం సర్పంచ్ స్వాతి సూచించారు. మండల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వైయస్సార్ సంపూర్ణ పోషణ రేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిఎంఎస్ కె.సరిత, ఎఎన్ ఎం స్రవంతి, అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, ఆశా కార్యకర్త పాల్గొన్నారు.
ఎర్రగుంట్ల : పట్టణ పరిధిలోని వలసపల్లె రోడ్డులోని అంగన్వాడీ సెంటర్‌లో స్థానిక కౌన్సిలర్ కోకోకోలా గౌస్ చేతుల మీదుగా బుధవారం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోషల్ మీడియా కో-కన్వీనర్ షర్ఫుద్దీన్, మాజీ కౌన్సిలర్ మస్తాన్‌వల్లి, వైసిపి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
దువ్వూరు : యుపి పాఠశాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు టేక్ హోమ్‌రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ప్రతినెల మూడు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, 500 గ్రాముల నూనె, ఐదు లీటర్ల పాలు, 25 కోడిగుడ్లు అందజేస్తామని ఎంపిడిఒ జగదీశ్వరరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్లు ధరణి, సౌజన్య, వరలక్ష్మి పాల్గొన్నారు.
పులివెందుల రూరల్ : సంపూర్ణ పోషణ బిడ్డల ఎదుగుదల, సంపూర్ణ రక్షణకు దోహదపడుతుందని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలోని సభా భవనంలో అంగన్వాడీ సిడిపిఒ శ్రీలత ఆధ్వర్యంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ టేక్ హౌం రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వరప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణి, బాలింతలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కిషోర్, లక్ష్మీ భార్గవి, లక్ష్మీ ప్రసన్న, గంగాభవాని గుల్జార్, కాంతమ్మ, వైసిపి నాయకులు డేనియల్ బాబు, సిద్దయ్య అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జమ్మలమడుగు : గర్భిణులు, బాలింతలు, తల్లులకు ఇంటి వద్దకే పోషకాహారాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోందని ఎంపిపి హరిత తెలిపారు. సాథనిక ఎంపిడిఒ కార్యాలయ సభాభవనంలో బుధవారం వైయస్సార్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డి, తహశీల్దార్ గుర్రప్ప, ఎంపిడిఒ రాఘవేంద్రనాథ్, సూపర్‌వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.










