ఐద్వా మహాసభలో ఐద్వా జిల్లా నాయకులు పద్మ
ప్రజాశక్తి-విఆర్.పురం
మహిళల హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు ఇసంపల్లి పద్మ అన్నారు. శనివారం మండలంలోని సున్నంవారి గూడెం గ్రామంలో ఐద్వా మండల మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలకు భద్రత, స్వేచ్ఛ కరువైందన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలను పాలకులు హరిస్తున్నారని విమర్శించారు. మహిళా హక్కులను పకడ్బందీగా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. మహిళల పక్షాన, మహిళల హక్కు కోసం ఐద్వా నిరంతరం పోరాడుతుందని చెప్పారు.
మండల కార్యవర్గం ఎన్నిక
అనంతరం ఐద్వా విఆర్ పురం మండల నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఐద్వా మండల అధ్యక్షులుగా ఎంపీపీ కారం లక్ష్మి, కార్యదర్శిగా సున్నం పార్వతి, ఉపాధ్యక్షులుగా కారం శాంతి, సహాయ కార్యదర్శులుగా తోడం బూబమ్మ, పూనెం జయమ్మ, 21 మందితో నూతన కమిటీ ఎన్నికైంది. ఈ మహాసభలో నాళ్ళరపు భారతి, తెల్లం తులసి, సర్పంచ్ వెట్టి లక్ష్మి, కట్టం చిన్నక్క, కారం సుజాత, పూనెం సిత, కుంజా సాయిలక్ష్మి, చిక్కాల విరమ్మ, నూనె భూజమ్మ, తెల్లం కన్నమ్మ పులి తదితరులు పాల్గొన్నారు.










