ప్రజాశక్తి - రేపల్లె
డ్వాక్రాలో మారు పేర్లతో మెప్మా సిబ్బంది అక్రమంగా రుణాలు తీసుకొని మోసం చేశారని, సమస్య పరిష్కారం చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఐద్వ, సీపీఎం ఆధ్వర్యంలో మోసపోయినా పొదుపు సంఘాల మహిళలు ఎంపీ మోపిదేవి వెంకటరమణరావును ఇంటి వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. మహిళలు సమస్యపై ఎంపీ స్పందించారు. మెప్నా పిడి, రేపల్లె మున్సిపల్ కమినర్‌లను సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలా ల్ మాట్లాడుతు పట్టణంలో మెప్మా ఆర్పీ, సిబ్బంది పేద మహిళలని టార్గెట్ చేసి అక్రమ గ్రూపులు ఏర్పాటు చేసి దొంగలోన్లు తీసుకుని మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారని ఎంపి దృష్టికి తెచ్చారు, పేద మహిళల పేర్లుతో రుణాలు తీసుకున్నారని రాతపూర్వకంగా రేపల్లె మెప్మా సిబ్బందికి ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మోపిదేవిని జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వ పట్టణ అధ్యక్షురాలు షేక్ జహీద్, కార్యదర్శి షేక్ ఆశ, గౌరవాధ్యక్షరాలు ఆర్ నాగమణి, డ్వాక్రా మహిళలు గౌసే, భూలక్ష్మి, షబానా, సుల్తానా, సిపిఎం నాయకులు కె ఆశ్విరాథం పాల్గొన్నారు.










