Nov 25,2022 23:29

ఎస్‌ఐ నీలిమను సత్కరిస్తున్న కాలేజీ అధ్యాపకులు

ప్రజాశక్తి - ములగాడ: మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ముందు ధైర్యంగా ఉండాలని, అవసరమైనప్పుడు పోలీసులను ఆశ్రయించాలని 'దిశ'పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ కె.నీలిమ అన్నారు. శుక్రవారం స్థానిక సెయింట్‌ ఆన్స్‌ డిగ్రీ కళాశాల 'లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీ' ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ, ప్రతి మహిళ రక్షణకు, భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. కుటుంబంలో గానీ, పనిచేసే ప్రదేశంలో గానీ, విద్యాలయాల్లో గాని లైంగిక వేధింపులకు గురైతే, వారు తగిన రీతిన స్పందించాలని అన్నారు. ఆత్మరక్షణ విద్యలను కళాశాలలో ప్రవేశపెట్టాలని అన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సిస్టర్‌ ప్రేమకుమారి అధ్యక్షత వహించిన సదస్సులోకమిటీ కన్వీనర్‌ ఎ.రోజా, కోఆర్డినేటర్లు వై.అనసూయా దేవి, కె.ఉమామహేశ్వరి, అధ్యాపకులు, మహిళా పోలీసులు ఉమ, మహేశ్వరి, అనురాధ పాల్గొన్నారు. అనంతరం ఎస్‌ఐ కె. నీలిమను ఘనంగా సత్కరించారు.