Mar 26,2023 16:43

కేసుల రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ

 

 

మహిళల రక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలి..

నాటు సారా, అక్రమ మద్యం ప్రత్యేక నిఘ పెట్టాలి..
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి : ఎస్పీ  కె.రఘువీర్ రెడ్డి
పాములపాడు పోలీస్ స్టేషన్ ను
కస్మిక తనిఖీ

ప్రజాశక్తి- పాములపాడు
             పాములపాడు పోలీస్ స్టేషన్ ను నంద్యాల జిల్లా ఎస్పీ  కె.రఘువీర్ రెడ్డి ఆదివారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన పోలీస్ స్టేషన్  పరిసరాలను పరిశీలించి  సంతృప్తిని వ్యక్తపరిచారు. స్టేషన్ లోని పలు దస్త్రాలను (రికార్డులను) పరిశీలించారు. స్టేషన్ కు సంబంధించిన రికార్డులు సరిగా  ఉంచుకోవాలని ఆదేశించారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని చట్ట పరిధిలో సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ కేసుల లేకుండా పని చేయాలన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,మహిళల రక్షణ కొరకు  నూతనంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ పట్ల మహిళల్లో అవగాహన కల్పించాలన్నారు. పిడిఎస్ రైస్ ,గుట్కా వంటి జూదాలు, అసాంఘిక కార్యకలాపాలఫై  ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నాటు సారాయి ,అక్రమ మద్యం పై ప్రత్యే నిఘా ఉంచి పూర్తిగా అరికట్టాలని అన్నారు. పోలీస్ స్టేషన్ లో వివిధ రకాల కేసులలో పట్టుబడిన వాహనాలను పరిశీలించి వాటిని త్వరగా సంబంధిత అధికారుల అనుమతి తీసుకుని డిస్పోజల్ చేయాలని తెలిపారు. ప్రజలతో పోలీసులు మైత్రి భావం పెంపొందే విధంగా నడుచుకోవాలని  సూచించారు. సైబర్ నేరాల పైన గ్రామాలలో మహిళా పోలీసులు  వాలంటీర్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాములపాడు ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు