Dec 14,2022 00:01

సచివాలయ మహిళా పోలీసులతో మాట్లాడుతున్న ఎసిపి నరసింహమూర్తి

ప్రజాశక్తి -కంచరపాలెం : మహిళల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఎసిపి అన్నెపు నరసింహమూర్తి సచివాలయం మహిళా పోలీసులకు సూచించారు. కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. సచివాలయ మహిళా పోలీసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై తమ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో సమస్యలపై పట్టు సాధించాలని సూచించారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సచివాలయ మహిళా పోలీస్‌కు ఒక కానిస్టేబుల్‌ అందుబాటులో ఉంటారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, యువతల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. వార్డుల వారీగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆలయాలు ఇతర ప్రభుత్వ సముదాయాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అనంతరం సిఐ ఎస్‌.విజరుకుమార్‌తో మాట్లాడారు. పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. పెండింగ్‌ కేసులు త్వరిత గతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు షమీర్‌, రవి కిషోర్‌, దివ్యభారతి పాల్గొన్నారు.