Jul 04,2023 16:36

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షురాలు టి. నిర్మల

మహిళల పోరుయాత్ర ను జయప్రదం చేయండి
- అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం
ప్రజాశక్తి - నంద్యాల

        నంద్యాల పట్టణంలోని నూనెపల్లి నందు మహిళా సంఘం ఆఫీసు నందు మంగళవారం మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది, ఈ యొక్క సమావేశానికి మహిళా సంఘం  రాష్ట్ర కోశాధికారి సావిత్రమ్మ, జిల్లా అధ్యక్షులు టి. నిర్మల హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ చిన్నారులు మహిళలపై హింసా రోజురోజుకీ విపరీతంగా పెరుగుతుందని అన్నారు.మహిళా మల్ల యోధులు ఢిల్లీలో చేసిన ఆందోళన  ఇందుకు  ఒక నిదర్శనం అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాయని , ప్రభుత్వాలు హింసను అరికట్టే వరకు మనము పోరు చేయాలి అందుకని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) మహిళల పోరుయాత్ర చేపడుతుందని అన్నారు.మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయనం చేయడానికి నిపుణులతో కమిటీ వేయాలని, మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని,నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి కఠినమైన శిక్షలు విధించాలన్నారు.ప్రభుత్వం మీడియా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి,హింస అస్లీలత అసమానతలను ప్రేరేపించే చలనచిత్రాలు, టీవీ సీరియల్స్, ఇంటర్నెట్ ,కార్యక్రమాలను నిషేధించాలన్నారు. కాలేజీలలో పని ప్రదేశాలలో వేధింపులు నిరోధించేందుకు అంతర్గత ఫిర్యాదులు కమిటీలు ఏర్పాటు చేయాలని, మద్యం మత్తు పదార్థాలు నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ,మండలానికి ఒక మద్యం షాపు మాత్రమే అనుమతించాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసము అన్ని పక్షాలను కూడగట్టి మా మహిళా సంఘం పోరాటాలు చేస్తుందన్నారు.కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా మహిళల  పోరు యాత్ర చేపట్టనున్నదని,ఆగస్టు 9 విజయవాడలో భారీ సభ నిర్వహించనుంది ,ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు రమణమ్మ, శివమ్మ ,మరియమ్మ ,వెంకట లచ్చమ్మ ,తిరుపాలమ్మ తదితరులు పాల్గొన్నారు.