మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి
ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: సమాజంలో మహిళల పాత్ర కీలకంగా మారిందని, అన్ని రంగాల్లో మహిళలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి కొనియాడారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంకొల్లులో జరిగిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొం టున్న సమస్యలు, ఉద్యోగాల్లో చేస్తున్న పలు సేవలను గురించి ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళ ల కోసం మరిన్ని చట్టాలు తీసుకువచ్చి వారిని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సమావేశంలో సిఐటియు నాయకులు ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










