చిలకలూరిపేట: స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద అర్బన్ ట్రాఫిక్ ఎస్.ఐ లోకేశ్వరరావు ఆధ్వర్యంలో దిశ యాప్ డౌన్ లోడ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం శుక్రవారం ఉదయం నిర్వ హించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌ఐ మాట్లా డుతూ అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ.జి. రాజేశ్వరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ యాప్‌ను తమ మొబైల్ ఫోన్‌లో మహిళలు తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. ప్రమాదంలో ఉన్న సమయంలో మహిళలు తమ మొబైల్ ఫోన్లో ఎస్.ఓ.ఎస్ బటన్ నొక్కితే వారు ఉన్న లొకేషన్ చాలా వేగంగా సమాచారం పోలీస్ సిబ్బందికి చేరు తుందని, దీని ఆధారంగా ఐదు నిమిషాలలో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరు కొని వారిని రక్షించవచ్చని వివరించారు. దిశ యాప్ ప్రతి మహిళకూ రక్షణ కవచంలా పనిచేస్తుందని అన్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఐదువందల మందితో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించామని, స్పెషల్ డ్రైవ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగినట్లు చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీసులు, అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పెదకూరపాడు: ప్రతి ఒక్కరూ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పెదకూరపాడు ఎస్సై వెంకట్రావు కోరారు. శుక్రవారం మం డలంలో ప్రధానమైన సెంటర్లలో దిశా యాప్ ను ప్రజల చేత డౌన్లోడ్ చేయించారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను విని యోగించుకోవాలని కోరారు.సత్తెనపల్లిరూరల్: దిశ యాప్ మహిళలకు రక్షణ కవచమని ప్రతి ఒక్కరూ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పట్టణ సిఐ యు శోభన్ బాబు మహిళకు విజ్ఞప్తి చేశారు. సత్తెనపల్లి పట్టణంలో దిశ యాప్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మహిళా పోలీసులు తాలూకా బస్టాండ్ ప్రాంతాల్లో దిశ యాప్ పై మహిళలకు అవగాహన కల్పించారు.










