ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: మహిళల కోసం ప్రత్యేక చట్టాలు రాజ్యాంగం రూపొందించిందని ప్రముఖ న్యాయవాది మేకల రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంకొల్లు ఎన్‌ఆర్‌అండ్‌విఎస్‌ఆర్ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని న్యాయం పొందవచ్చని అన్నారు. కర్ణాటకలో ఒక గిరిజన మహిళ అడవుల సంరక్షణ చేపడుతూ 30 వేల మొక్కలు నాటినందుకు ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసిన సంగతిని ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌్‌రెడ్డి గుర్తు చేశారు. సమావేశానికి ప్రధానోపాధ్యాయిని వి ఉదయకుమారి అధ్యక్షత వహించారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు కెజెఆర్ కుమారి, కె పుష్పలత, టి వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.










