
మహిళల హాకీజట్టు పతకంపై ఆశలు రేపుతోంది. ఏమాత్రం అంచనాల్లేకుండా ఒలింపిక్స్ బరిలోకి దిగిన జట్టు గ్రూప్ లీగ్ తొలి మూడు మ్యాచుల్లో ఓడినా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక క్వార్టర్స్‌లో మూడుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుచేసి సంచలనం సృష్టించింది. అదే ఊపులో బుధవారం అర్జెంటీనాతో జరిగే పోటీలో గెలిస్తే వీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కనుంది.