Aug 22,2023 22:04

ఫొటో : సిఎం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

మహిళల ఆర్థికాభివృద్ధి జగనన్న పెద్దపీట
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను అందజేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆత్మకూరు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం సంఘమిత్ర కార్యాలయంలో పొదుపు మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డికి పొదుపు మహిళలు అధికారులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.
98 శాతం సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు నేరుగా మహిళల ఖాతాల్లోనే జమ అయిందని, దీని ద్వారా వారు వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ క్రాంతి పథంలో పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంపై హర్షం చేస్తూ ఉద్యోగులతో కలసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి వారందరితో కలసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, జెసిఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆదిశేషయ్య, డాక్టర్‌ ప్రణీత్‌, కొండా వెంకటేశ్వర్లు, ముజ్జు, వెలుగు ఎసి వెంకటేశ్వర్లు, ఎపిఎం వెంకమ్మ, బట్టేపాడు సొసైటీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రవికుమార్‌ రెడ్డి, మెప్మా సిఎండి అంకయ్య, మెప్మా సిఒ మాధవి, మెప్మా సిబ్బంది, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.