Oct 15,2023 20:53

జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ

రాయచోటి : జిల్లాలోని పొదుపు మహిళలను ఆర్థికంగా అభివద్ధి చేయడమే తమ లక్ష్యం అని జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ పేర్కొ న్నారు. అన్నమయ్య జిల్లాలో డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎలా అభివద్ధి చెందాల్లో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాలో డిఅర్‌డిఎ కార్యాలయాల వివరాలు తెలపండి?
జిల్లాలో జిల్లా సమాఖ్య కార్యాలయం 1, డిఆర్‌డిఎ కార్యాలయంతో పాటు 30 మండలాల్లో 30 మండల సమాఖ్యలు స్వయం సహాయక సంఘాలు అందుబాటులో ఉన్నాయి.
డిఆర్‌డిఎ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వివరిం చండి?
మహిళా సంఘాల ఏర్పాటు చేయడం, వాటి సామర్ధ్యాలను పెంపొందించడం, బ్యాంక్‌ లింకేజీ కార్యక్రమం ద్వారా లోన్స్‌ ఇప్పించడం, స్త్రీనిధి ద్వారా జీవనోపాధులకు ఆర్థిక సాయం చేయడం, ఇవ్వడం, ఎస్‌సి, ఎస్‌టి సంఘాల మహిళలకు సున్నా వడ్డీకే జీవనోపాధులకు రుణాల పంపిణీ చేస్తాం. రైతు ఉత్పత్తి దారుల సమాఖ్యల ఏర్పాటు వాటికి ఆర్థిక సహాయం, అభయహస్తం పెన్షన్‌, సామాజిక భద్రత పెన్షన్స్‌, వైఎస్‌ఆర్‌ చేయూత వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ, జగనన్న పాల వెల్లువ మొదలగు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
జిల్లాలో మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయి? సభ్యులు సంఖ్య ఎంత?
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 30,412 సంఘాలున్నాయి.3,00,037 మంది సభ్యులున్నారు.
వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాలకు ఎంత చేయూత అందించారు?
వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు కోసం బ్యాంక్‌ రుణాలు రూ.261 కోట్లు,స్త్రీనిది రూ.88 కోట్లు అందిస్తున్నాం.
వైఎస్‌ఆర్‌ బీమా కింద ఎంతమందని నమోదు చేశారు?
ఈ సంవత్సరం ఇప్పటివరకు 232 మందిని వైఎస్‌ఆర్‌ బీమా కింద నమోదు చేశాం.
మహిళలకు ఏమైనా సలహాలు, సూచనలను ఇవ్వాలనుకుంటున్నారా?
మహిళలు తాము తీసుకున్న రుణాలను సక్రమమగా జీవనోపాధుల కోసం ఉపయోగించుకొని తద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలి. అలాగే రుణాల చెల్లింపు విషయంలో, సమావేశాల నిర్వహణ, పుస్తక నిర్వహణ మొదలగు విషయాల్లో మంచి క్రమశిక్షణ కలిగి సంఘాలు అభివద్ధిలోనికి తీసుకురావాలి.