
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
- కాపు అక్క చెల్లెమ్మలకు రు. 8.36 కోట్లు వారి ఖాతాల్లో జమ
- జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం వైయస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా వరుసగా నాలుగో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 3,57,844 మందికి రూ.536.77 కోట్ల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నుండి బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ అభివద్ధి సలహాదారు హబీబుల్లా తదితరులు వీక్షించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో నాల్గవ విడత వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద 5573 అర్హత గల కాపు మహిళలకు రూ. 8.36 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఆళ్లగడ్డలో 1327 మందికి రూ.1.99 కోట్లు, బనగానపల్లిలో 955 మందికి రూ.1.43 కోట్లు, డోన్‌లో 1075 మందికి రూ.1.61 కోట్లు, నందికొట్కూర్‌లో 295 మందికి రూ.0.44 కోట్లు, నంద్యాలలో 960 మందికి రూ.1.44 కోట్లు, పాణ్యంలో 287 మందికి రూ.0.43 కోట్లు, శ్రీశైలంలో 674 మందికి రూ.1.01 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు చెప్పారు. మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బీసీ సంక్షేమ అధికారి జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.