Jun 19,2023 00:18

ప్రజాప్రతినిధులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సంతృప్తికరంగా ముగిసిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. గొలుగొండ మండలంలో ప్రారంభించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఆదివారం చివరిగా పాతమల్లంపేట పంచాయతీ ద్వారకానగరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతీ గడపకు వెళ్లినప్పుడు మహిళల కళ్లల్లో ఆనందం చూశానని, నవరత్నాల పథకాలపై ఎంతో సంతృప్తికరంగా సమాధానాలు చెప్పారన్నారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో మండలంలో సర్పంచ్‌లను, ఎంపిటిసిలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిటికెల భాస్కర్‌నాయుడు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, వైస్‌ ఎంపిపి సుర్ల ఆదినారాయణ, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు నల్లబెల్లి శ్రీనివాసులు, మండల యూత్‌ అధ్యక్షుడు రామకృష్ణ నాయుడు, మండల సచివాలయం కన్వీనర్‌ పానీ శాంతారావు, కోపరేటివ్‌ సొసైటీ అధ్యక్షులు పెద్దిరాజు, ఏఏసి అధ్యక్షులు కొల్లు సత్యనారాయణ, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత, వైయస్సార్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పత్తి రమణ, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.