Oct 07,2023 23:55

తాడేపల్లి: మహిళలు అభివృద్ధి చెందితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో జరుగుతున్న మహిళా నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ అపార్టుమెంట్స్‌ తాడేపల్లి (క్యాట్‌) అధ్యక్షులు జిఎస్‌ఆర్‌ మోహనరావు, క్రెడారు అసోసియేషన్‌ నాయకులు సతీష్‌, శ్రీధర్‌, వరుణ్‌, రాష్ట్ర బాలోత్సవాల కన్వీనర్‌ పి.మురళీకృష్ణ, విశ్రాంత ఉద్యోగి గోపాలం సాంబశివరావు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న మనం కొంత సమాజం కోసం ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు తెలి పారు. కుట్టుశిక్షణ తీసుకుంటున్న మహిళలను అభినం దించారు. రెడీమేడ్‌ మీద ఉన్న అపోహ వదిలించుకోవా లన్నారు. కుట్టుశిక్షణలో అద్భుతంగా తర్ఫీదు పొందితే అద్భుతమైన అవకాశాలు పొందవచ్చన్నారు. అందుకు తమ కుటుంబాల్లో మహిళలు చేస్తున్న ప్రయత్నాలను కూడా వివరించారు. అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో భార్యభర్తలు ఇద్దరూ పని చేస్తేనే కుటుంబాలు నడిచే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కోశాధికారి గాదె సుబ్బారెడ్డి,దుర్గి కోదండరామయ్య, చింతా వెంకటరత్నం, నాగూర్‌బి, బి.దశరాధరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.