Apr 05,2023 00:08
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న కృష్ణ చైతన్య

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆర్థికంగా ఎదగాలని జగనన్న ప్రభుత్వం మహిళలకు ఎంతో కృషి చేస్తుందని శాప్‌ నెట్‌ చైర్మన్‌ అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. పొదుపు సంఘాల మహిళలతో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం బల్లికురవ జడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్లో పొదుపు సంఘాల ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మొత్తం 3 విడతలకు 24 కోట్ల 46 లక్షల 8వేల6 వందల రూపాయలు వచ్చాయని తెలిపారు. కొప్పెరపాడు శ్రీ రాధాకృష్ణ కోలాట భజన మడలివారి ప్రదర్శన ఆకట్టుకుంది. వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమానికి భారీగా 4000 మంది మహిళలు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్‌ కృష్ణ, వైఎస్సార్‌ క్రాంతి పథం ఏపిఎం బాచిన సురేంద్రబాబు, వ్యవసాయ మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ మరియు బాపట్ల జిల్లా వ్యవసాయ సంఘం అధ్యక్షుడు వైసిపి కన్వీనర్‌ చింతల పేరయ్య, ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి, జడ్పిటిసి చింతల అంజలి శ్రీనివాస్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ శ్రీను వలి, మండల ఉపాధ్యక్షుడు ఇప్పల సుబ్బారెడ్డి, ఎంఈఓ వీరరాఘవయ్య, అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.