Jun 06,2023 01:52
నగదును అందజేస్తున్న ఆర్గనైజేషన్‌ సభ్యులు

ప్రజాశక్తి-కర్లపాలెం: కష్టాలలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఫ్రెండ్స్‌ ఆదర్శ యూత్‌ ఆర్గనైజేషన్‌ ఎప్పుడు ముందుంటుందని గౌరవాధ్యక్షుడు శ్రీనివాస రావు అన్నారు. కర్లపాలెం మండలం పెరలి పంచాయతీ మల్లెలవారిపాలేనికి చెందిన గొరుముచ్చు విజయశాంతి రోడ్డు ప్రమాదానికి గురైన మహిళకు ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో కొంత నగదును ఆర్థిక సాయంగా అందజేశా రు. ఈ సందర్భంగా వేజెండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టాలలో ఉన్న పేదవారిని ఆదుకోవడానికి స్నేహితుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్‌ ఎందరో పేదలకు అండగా నిలుస్తోందని అన్నారు. సభ్యుల సహాయ సహకారాలతో పేదవారిని ఆదుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, ఆర్థిక ఇబ్బందులతో సమస్యలు ఎదుర్కొంటున్న పేదవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు. సమాజంలో ఎంతోమంది ప్రజలు డబ్బును వృథాగా ఖర్చు పెడుతున్నారని, అలా ఖర్చు పెట్టే వాటిలో కొంత నగదు పేదవారికి పంచితే వచ్చే సంతోషమే వేరుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు బండ్రెడ్డి గోపి, ఉపాధ్యక్షుడు జంగం దాసు, కార్యదర్శి బత్తుల సురేష్‌, ట్రెజరర్‌ జోగి సువర్ణరాజు, సభ్యులు విన్నకోట శ్రీనివాసరావు, కత్తి రాజు, కోటికలపూడి జయరాం, కందుల శ్రీకాంత్‌ పాల్గొన్నారు.