మహిళా వర్థిల్లు.. ఆకట్టుకున్న సంగీత నత్య ప్రదర్శనలు
ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మ్యూజిక్ డాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విభాగంలో నిర్వహించిన ముత్తుస్వామి దీక్షిత ఆరాధన కార్యక్రమాల్లో సంగీత కచేరీలు నత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీ ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ముఖ్యమైన వారు. వీరి వర్ధంతి కార్యక్రమాలు ప్రతిఏటా నరక చతుర్దశిన జరుపుకుంటారు. దీని సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో భాగంగా అష్టాదశ విద్యార్థులు, ప్రాజెక్టు ఫెలోస్ కామాక్షి మౌనిక, సమీరజ శిక్షణలో చక్కగా కీర్తనలు ఆల పించారు. ఈ సంద ర్భం గా హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ ప్రిన్సిప ల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఆర్‌ఎన్‌ఎస్ శైలేశ్వరి విద్యార్థులకు, స్టాఫ్ కు స్కాలర్స్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి సి ప్రొఫెసర్ భారతి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. రజనీ, ఇతర అధ్యాపకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.










