మహిళా వర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఫ్రీ ఆర్‌డి సెలక్షన్స్
ప్ర్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతిలోని ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ప్రీ ఆర్ డి సెలెక్షన్స్ జరిగాయి. ఈ సెలెక్షన్స్ నిర్వహించడానికి ఎన్ ఎస్ ఎస్ రీజనల్ డైరెక్టర్ ఎమ్. రామకష్ణ , రీజనల్ డైరెక్టరేట్ నుంచి సంజరు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్ కు మహిళలకు అవకాశం ఉందన్నారు. విద్యార్థులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌ఎస్ ఎస్ వాలంటీర్లకు తెలిపారు. ఈ ఎంపికకు 40 మంది వాలంటీర్లు హాజరయ్యారు. అనంతరం విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య దేపూరు భారతి వారిని సన్మానించారు. రిజిస్ట్రార్ ఆచార్య రజని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ కో-ఆర్డినేటర్ ఆచార్య విద్యావతి , ప్రోగ్రామ్ అధికారులు డా. నీరజ, డా. మాధవి, డా. పద్మావతి, డా. యువశ్రీ, డా. సునీత, డా. స్వాతి లు పాల్గొన్నారు.










