May 03,2023 23:15

సర్టిఫికెట్లు అందిస్తున్న డాక్టర్‌ కోమలి

కేంద్రకారాగార డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ కోమలి
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
మహిళా విద్య సమాజాభివృద్ధికి మూలమని కేంద్ర కారాగార డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ కోమలి అన్నారు. మహిళా అభ్యుదయానికి పూలే అంబేడ్కర్‌ మార్గంలో కృషి చేస్తున్న స్వర్ణాంధ్ర రాంబాబు సేవలు అభినందనీయమన్నారు. లాలాచెరువులోని స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణంలో జరిగిన నైపుణ్య శిక్షణ కేంద్రం విద్యార్థినులకు ఉత్తీర్ణత పత్రాలు బహుకరణ కార్యక్రమంలో కోమలి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమలి మాట్లాడుతూ మహిళలకు చదువుతోపాటు కుటుంబ అభివృద్ధిలో చేతివత్తులు ఎంతగానో దోహదపడతాయన్నారు. కుట్టు శిక్షణ మగ్గం వర్క్‌, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌లో నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా మహిళలను స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఎంతగానో ప్రోత్సహిస్తుందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన సుమారు 95 మంది మహిళలకు డాక్టర్‌ కోమలి చేతుల మీదుగా ఉత్తీర్ణత పత్రాలను అందించారు. ఈ సమావేశానికి స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్‌ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. రాంబాబు మాట్లాడుతూ మహిళల విద్య వారి స్వయం వద్ధి కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ 25 ఏళ్లుగా 16 వేల మందికి శిక్షణ ఇచ్చిందన్నారు. శిక్షణ పొందిన అనేకమంది మహిళలు ఉపాధి పొందుతున్నారని రాంబాబు తెలిపారు. ఉచిత రీతిన అందించే శిక్షణలో మానవతా విలువలు, కుటుంబ పాలన, సమాజసేవలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక వేసవి శిక్షణ కార్యక్రమం మే 4 నుంచి ప్రారంభమవుతున్నాయని ఆసక్తి గల మహిళలు స్వయంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థని సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా ఇది డాక్టర్‌ కోమలని స్వర్ణాంధ్ర తరపున దుస్సాలువుతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఇన్‌ఛార్జి ఎస్‌.దుర్గాదేవి, టీచర్‌ ఉషారాణి, మణి, యమునా, ప్రవల్లిక, లక్ష్మి, వీరరాఘవ, లలిత, దేవి, దుర్గ తదితరులు పాల్గొన్నారు .