Aug 19,2023 18:44

ప్రజాశక్తి - భీమడోలు
     విద్యావ్యాప్తికి ముఖ్యంగా మహిళా విద్యకు కృషిచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయం అని పలువురు వక్తలు తెలిపారు. గుండుగొలనులో శనివారం జ్యోతిరావు పూలే 196వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్‌పిటిసి తుమ్మగుంట భవానీ రంగా, సర్పంచ్ల ఛాంబర్‌ అధ్యక్షురాలు సునీత మాన్సింగ్‌, ఎంపిపి కె.రామయ్య, గ్రామ ఉపసర్పంచి ముదుండి సూర్యనారాయణ రాజు, వైసిపి గ్రామ సచివాలయాల కన్వీనర్‌ జి.మురళి, ఎంపిటిసి ముళ్లగిరి జాన్సన్‌, వైసిపి ప్రముఖులు వి.అచ్యుతరామయ్య, రావిపాటి సత్య శ్రీనివాస్‌, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు.