మహిళా సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి
ప్రజాశక్తి- ఎమ్మిగనూరు: మహిళ ఆర్థిక అభివృద్ధికి బాసుట నిలుస్తూ, మహిళా సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ ఆసరా, సున్న వడ్డి, చేయుత అందించారు. అమ్మ ఒడి ద్వారా పాఠశాలకు పిల్లలను పంపి విద్యను అందించాలనే సంకల్పంతో నిరక్షరాస్యత నిర్మూలన దిశగా అడుగువేశారు. విద్యాదీవెన, వసతి దీవెన 2516 మందికి 251.6 లక్షలు, వై.యస్.ఆర్ ఇబిసి నేస్తం 195 మంది ఉన్నారు. కాపు నేస్తం, వైయస్సార్. పెన్షన్ కానుక 9515 మందికి 2.68 లక్షలు, వాహన మిత్ర 292 మందికి 29.2 లక్షలు, వైయస్సార్ నేతన్న నేస్తం 333.12 లక్షలు ఇలాంటి పథకాల ద్వారా మొత్తం రూ. 6992.78 లక్షలు జగనన్న పథకము మహిళా లోకానికి ఉపాధి లభ్యం ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిఆర్. బసిరెడ్డి , మెప్మా సభ్యులు భవని, రత్నమ్మ, పార్వతి, విజయలక్ష్మి, గౌరమ్మ, పుష్ప, సునీత జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










