Jun 08,2023 23:59

మంగళగిరి రూరల్‌: సిపిఎం సభ్యులు పోతురాజు నరసింహారావు భార్య, గ్రామ మహిళా సంఘం (ఐద్వా) నాయకురాలు లక్ష్మీ సామ్రాజ్యం(79) గురువారం మృతి చెందారు. సామ్రాజ్యం దంపతులకు ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె మహిళా సంఘంలో విస్తృతంగా పని చేశారు. గ్రామంలో 1969లో మహిళా సంఘం ఆధ్వర్యంలో తర గతులు నిర్వహించగా ఆమె విశేష సేవలను అందించారు. కుటుంబాన్ని పార్టీ వైపు నడిపించడంలోనూ ఆమె కృషి ఎంతో ఉంది. ఆమె మృతికి సిపిఎం నేతలు నివాళులర్పిం చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జె వి రాఘవులు, బి. కోటేశ్వరి, తమ్మా ప్రసాదరెడ్డి, ఆళ్ల సాంబిరెడ్డి, ఈదా ప్రతాప్‌ రెడ్డి, ఎస్‌. శేఖర్‌, గాదె రామారావు, అప్పిగట్ల ప్రకాశరావు ఎం శివయ్య, గాదెే మాధవరెడ్డి నివాళులర్పించారు.