Aug 21,2023 16:33

ప్రజాశక్తి - ముసునూరు
    అక్కా, చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆదుకుంటున్నారని నూజివీడు ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు తెలిపారు. సోమవారం మండలంలోని ముసునూరు హైస్కూల్‌లో 4వ విడత సున్నా వడ్డీ చెక్కులు పంపిణీ కార్యక్రమం ఎపిఎం కుంటుంబాబు, ఎంపిడిఒ జి.రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల ద్వారా ఎన్నో సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మండలంలోని 16 గ్రామాల్లోని 14,706 మంది మహిళలకు, 1470 గ్రూపులకు రూ.కోటి 98 లక్షల 74 వేల 989లు చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి వరికూటి ప్రతాప్‌, ఎంపిపి రాపర్ల కృష్ణకుమారి, వైస్‌ ఎంపిపి కోటగిరి రాజానాయన, వైస్‌ ఎంపిపి-2 పాముల గంగధరరావు, వైసిపి మండల అధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు, సర్ఫంచిలు, ఎంపిటిసిలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.