Sep 11,2023 23:42

తాడేపల్లి: సమాజంలో మహిళా సాధికారతకు కుట్టు శిక్షణా కేంద్రాలు ఉపయోగపడతాయని విజ్ఞాన కేంద్రాల రాష్ట్ర కన్వీనర్‌ పిన్నమనేని మురళీకృష్ణ చెప్పారు. సోమవారం తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌లోని మహిళా నైపుణ్య శిక్షణా కేంద్రం (అమరారెడ్డి భవన్‌)లో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహిళా కుట్టు శిక్షణ కర పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీ కృష్ణ మాట్లాడుతూ సమాజంలో మహిళలు తమ కాళ్ల మీద తాము ఆర్థికంగా నిలబడేందుకు కుట్టు మిషన్‌ శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం కుట్టుమిషన్‌ శిక్షణ మాత్రమే 90 రోజుల పాటు నేర్పిస్తామని, నిష్ణా తులైన మాస్టర్‌ ఆధ్వ ర్యంలో ఈ శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. భవి ష్యత్తులో మగ్గం, ఎంబ్రాయిడింగ్‌, బ్యూటీషియన్‌, కం ప్యూటర్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, గణితంలో మెళకువలు తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కోశాధికారి గాదె సుబ్బారెడ్డి, మహిళా శిక్షణా నైపుణ్య కేంద్రం నిర్వాహకులు చింతా వెంకటరత్నం మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు అమరారెడ్డి భవన్‌లో కుట్టు శిక్షణ ప్రారంభó మవుతుందని చెప్పారు. డిసెంబర్‌ 15 వరకు 90 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుంద న్నారు. ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రతిరోజూ శిక్షణ ఉంటుందన్నారు. పేర్లు నమోదు చేసుకునే వారు సం బంధిత దరఖాస్తుతో పాటు ఆదార్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌ పోర్టు ఫొటోతో పాటు 90 రోజుల శిక్షణకు రూ.వెయ్యి చెల్లించాలని చెప్పారు. మరిన్ని వివరాలకు 79939 34411, 9866029486 నెంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంటి ఎంసి బాలోత్సవం నిర్వాహకులు డి.కోదండరామయ్య, బి.రామారావు, అంజిరెడ్డి, జి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.