మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే శిల్పా
ప్రజాశక్తి - ఆత్మకూర్
మహిళా సాధికారతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డు నందు మంగళవారం నాడు మూడో విడత ఆసరా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు టౌన్‌లో సెంటున్నర స్థలం ఇచ్చామని అన్నారు. హైవే మార్గానికి కట్టుకున్న ఇళ్లు పోతున్నాయని న్యాయం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు. మహిళలకు పార్టీ పదవులలో, రాజ్యాంగ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత సిఎం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ అందరి ఆశీర్వాదాలు తమప్రభుత్వం మీద ఉండాలని కోరారు. అనంతరం ఆత్మకూరు మండలంకు సంబంధించి 909 పొదుపు సంఘాలకు 4,54,00,000 రూపాయలకు సంబంధించి భారీ చెక్కును మహిళలందరికీ అందజేశారు. అంతకుముందు మూడో విడత ఆసరా ప్రోగ్రామ్‌లో సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సందేశాన్ని మహిళలం దరికీ మెప్మా సిబ్బంది పుల్లయ్య తెలియజేశారు. అనంతరం మహిళలు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాల గురించి తెలియజేశారు. సమస్యలను ఎమ్మెల్యే తక్షణమే పరిష్కరిస్తున్నారని పొదుపు సంఘాల ఐక్య సంఘం లీడర్ దుర్గమ్మ అన్నారు. శిల్పా భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మహిళలకు ఎన్నో పథకాలు, సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. జెడ్పిటిసి సభ్యులు శివశంకర్ రెడ్డి, ఎంపీపీ నల్లకాలవ తిరుపాలమ్మ, ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఆసియా మూరుప్, సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్ కుమార్, ఆత్మకూరు కమిషనర్ శ్రీనివాసరావు, శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి, స్టేట్ డైరెక్టర్ అంజాద్ అలీ, జడ్పిటిసి సభ్యులు శివశంకర్ రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఆసియా మురాఫ్, సీనియర్ నాయకులు రషీద్, మండల అధ్యక్షులు రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్లు సుల్తాన్, విజరు చౌదరి, సింగల్ చైర్మన్ సింగల్ విండో చైర్మన్ సురేష్, ఎంపీపీ తిరుపాలమ్మ, కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, అధికారులు, వైసిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు : మహిళల ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మంగళవారం సుండిపెంట రెడ్ల కళ్యాణ మండపం నందు పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వం పొదుపు మహిళలను రకరకాల మాసాలతో మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. శ్రీశైలం మండలంలో 334 స్వయం సహాయక సంఘాలకు వైఎస్‌ఆర్ ఆసరా కింద ఒక కోటి 79 లక్షల 55,932 రూపాయలను ఇచ్చిన ఘనత సిఎం జగన్‌కే దక్కిందన్నారు. రాబోవు రోజులలో ఏడు కోట్ల వ్యయంతో నీటి సమస్యను తీర్చనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎంపీడీవో మోహన్, స్థానిక తాసిల్దారు రాజేంద్ర సింగ్,స్థానిక వైసిపి నాయకులు భరత్ రెడ్డి, వట్టి వెంకటరెడ్డి,ప్రవీణ్ తేజ, రఫీ, రజాక్, గుండయ్య యాదవ్, మహిళలు పాల్గొన్నారు.










