చెక్కును ఇస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్
ప్రజాశక్తి- పాడేరు:చింతపల్లి యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్కును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఐటిడిఎ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన స్పందనలో చెక్కును అందించిన కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకు లింకేజ్‌ను 38 స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ, లీడ్ జిల్లా మేనేజర్ రవితేజ, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళి, లబ్దిదారులు పాల్గొన్నారు..










