ప్రజాశక్తి-చీమకుర్తి : మహిళాసాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. స్థానిక కొత్త కుమ్మరిపాలెం సెంటర్‌లో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సారధ్యంలో మహిళా సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగడం ద్వారా సాధికారిత సాధించవచ్చన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. ప్రతి మహిళ తమ కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దు కోవాలన్నారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ ఇన్యూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చల్లా అంకులు,వైస్ చైర్మన్ బి. వెంకటరెడ్డి, కౌన్సిలర్లు మేకల సులోచన, ఎ. రామబ్రహ్మం, తప్పెట బాబూరావు, మంచా హరికృష్ణ, సుబ్రహ్మణ్యం, అయ్యపురెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ ఎస్‌కె. ఫజులుల్లా తదితరులు పాల్గొన్నారు.