Apr 06,2023 21:46

ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు
ప్రజాశక్తి - పోలవరం

             మహిళా సాధికారతే సిఎం జగన్‌ లక్ష్యమని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం ఐకెపి కార్యాలయం ఆవరణలో మూడో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎంఎల్‌ఎ మహిళా సంఘాల సభ్యులకు ఆసరా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ పోలవరం మండలంలో 943 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి 8999 మంది లబ్ధిదారులకు రూ.7.33 లక్షలు లబ్ధి చేకూరిందన్నారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వాలన్ని కూడా మహిళలందరినీ ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయన్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం జగనన్న తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్‌డిఎ పీడీ విజయరావు, ఎపిడి నాగేశ్వరరావు, ఎపిఎం శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి సభ్యులు కలుం హేమకుమారి, ఎంపిపి సుంకర వెంకటరెడ్డి, వైస్‌ ఎంపిపి మీడియం సింగరాజు, శ్రీదేవి, వైసిపి మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, ఎస్‌బిఐ బ్యాంక్‌ మేనేజర్‌ నవీన్‌కుమార్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌, ఎస్‌ఐ పవన్‌కుమార్‌, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.