Oct 14,2023 00:17

- 83 డ్వాక్రా సంఘాలకు రూ.15.61కోట్ల రుణ మాఫీ
- పొదుపు సంఘాల మహిళలతో ఎంఎల్ఎ కోన రఘుపతి


ప్రజాశక్తి - కర్లపాలెం : మహిళలు ఆర్ధికంగా నిలదోక్కొకొని ఆర్ధిక స్వావలంభన దిశలో పయనింపచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎంఎల్‌ఎ కోన రఘుపతి అన్నారు. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణమండపంలో మహిళా స్వావలంభనకు జగనన్నవరాలజల్లు కార్యక్రామంలో మండల మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో యునియన్ బ్యాంకు, సిజిజిబి, ఇండియన్ బ్యాంకు సౌజన్యంతో  ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాఆడారు. మహిళలు సుస్థిర ఆదాయంతో కుటుంబాల్లో వెలుగులు రావాలని అన్నారు. వ్యాపార, జీవనోపాధి అవకాశాలకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పధకాలను ఉపయోగించుకోవాలని అన్నారు. మహిళలు లక్షాధికారులు కావాలనే లక్ష్యంతో పధకాలన్నీ మహిళల పేరుతోనే అమలు చేస్తూ సిఎం జగన్‌ మహిళా పక్షపాతిగా నిలిచారని అన్నారు. పొదుపు సంఘాల మహిళల బాధలు సిఎం జగన్‌ పాదయాత్రలో కళ్లారా చూశారని అన్నారు. చలించిపోయి నాలుగు దఫాల్లో పొదుపు సంఘాల కాతాల్లో రుణం జమ చేస్తున్నట్లు చెప్పారు. మండలానికి వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా రూ.39కోట్లు కర్లపాలెం మండలానికి వచ్చినట్లు తెలిపారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దటం కోసం ఋణ పరిమితి రూ.10లక్షలు నుండి రూ.20లక్షలకు పెంచినట్లు తెలిపారు. మహిళల అభివృద్ది కోసం అమూల్, హిందూస్తాన్ యూని లివర్, ఐటిసి, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, అలన వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. రెండో ఏడాది అజియో –రిలయన్స్, గ్రామీణ వికాసకేంద్రం, టేనేజర్, మహేంద్ర, ఖేతి వంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకొని వ్యాపార మార్గాలు చూపించినట్లు తెలిపారు. యునియన్ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు ద్వారా 83సంఘాలకు 830 మంది సభ్యులకు రూ.13.81కోట్లను వన్ క్లిక్ వన్ చెక్ ద్వారా, స్త్రినిది 210సభ్యులకు రూ.1.66కోట్లు, సిఐఎఫ్ ద్వారా 12 సంఘాకు రూ.14.5లక్షలు కలిపి మొత్తము రూ.15.61కోట్ల రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమం లో బ్యాంకు మేనేజర్లు మురళి, శైలేష్ భగత్, రత్నజ్యోతి, సర్పంచ్ నక్క లలితకుమారి, జడ్పిటిసి పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఎఎంసి చైర్మన్ డి సీతారామిరెడ్డి, వైసిపి కన్వీనర్ ఎల్లావుల ఏడుకొండలు, ఉపాధ్యక్షులు పందరబోయిన సుబ్బారావు, ఎంపిటిటి తాండ్ర సాంబశివరావు, ఆసిఫ్ ఆలీ, సర్పంచులు దేవరకొండ అంకమ్మ, మల్లెల వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు  పరమానంద కుమార్, యాజలి వైసిపి ఇన్చార్జి పేరాల వెంకట సురేష్, సచివాలయ కన్వినర్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.