Apr 28,2023 00:33

నినాదాలు చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి-మోతుగూడెం
మహిళా రెజ్లింగ్‌ క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు, బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన చింతూరు మండలం తులసిపాక గ్రామంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఢిల్లీలో రెజ్లింగ్‌ క్రీడాకారులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ బ్రిజ్‌ భూషణ్‌, మరి కొంతమంది కోచ్‌లు తమను లైంగికంగా వేధింపులకు పాల్పడుతూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని మూడు నెలల క్రితం రెజ్లర్లు ఆందోళన చేపట్టి కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా మోడీ ప్రభుత్వం నేటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం దుర్మార్గమన్నారు. అంతర్జాతీయంగా పతకాలు సాధించి దేశ ప్రతిష్టను, గౌరవాన్ని పెంచిన మల్ల యోధులపై వేధింపులకు పాల్పడటం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్రం బ్రిజ్‌ భూషణ్‌, ఇతరులపై చర్యలు తీసుకోవాలని, మల్లయోధులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.