ప్రజాశక్తి-బాపట్ల రూరల్: ఢిల్లీలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా బాపట్లలో ర్యాలీ నిర్వహించారు. బాపట్ల పాత బస్టాండ్ ఆవరణలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెజ్ఞర్లపై, మహిళ యోధులు మన దేశానికి ప్రపంచంలోనే బంగారు పతకాలు సాధించి పెడుతున్నటువంటి మహిళలపై బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురిచేశారు. దీనిపై మల్లయోధులు పోలీస్ కేసు కూడా ఢిల్లీలో పెట్టగా వారిని వారి కుటుంబ సభ్యులను బిజెపి ఎంపీ, వారి అనుయాయులు రెజ్లర్లపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అంతేకాదు కేసును పక్కదారి పట్టించడానికి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల భౌతిక దాడులు కూడా చేయటానికి వెనకాడట్లేదు దీన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు, మహిళలు ట్రేడ్ యూనియన్ రంగాలవారు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా శనివారం బాపట్ల సీఐటీయూ ఆధ్వర్యంలో పాత బస్టాండు నుంచి తవ్వకాల వరకు నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు సుభాషిణి అధ్యక్షత వహించారు. సిఐటియు నాయకులు పాల్గొని బిజెపి ఎంపీని అరెస్టు చేసేవరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఓ లక్ష్మణరావు, శామ్యూల్, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు రమేష్, రవి, రవి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.










