
ప్రజాశక్తి- పరవాడ
మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా హింసపై పోరుయాత్ర పేరుతో ఈ నెల 28 నుండి ఆగస్టు 9వ తేదీ వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా జాతాను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పి.మాణిక్యం పిలుపునిచ్చారు. మండలంలోని వాడ చీపురుపల్లి గ్రామంలో ఐద్వా ఆధ్వర్యాన బుధవారం జరిగిన సదస్సులో మాణిక్యం మాట్లాడుతూ మద్యం, మత్తు పదార్థాలు నియంత్రించాలని, హింసలేని సమాజం కోసం చేయ చేయ కలుపుదాం అనే కార్యక్రమం ఈనెల 28 నుండి ఆగస్టు 9 వరకు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రస్థాయి యాత్ర జయప్రదానికి ప్రజలందరూ ఆర్థికంగా సహకరించాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై హింస రోజురోజుకీ విపరీతంగా పెరుగుతుందని తెలిపారు. మహిళల మల్ల యోధులు ఢిల్లీలో చేసిన ఆందోళన చేపడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల చాలా నిర్లక్ష్య ధోరణంతో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళలపై హింసను అరికట్టే వరకు మనం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా జాయింట్ కార్యదర్శి ఆర్ లక్ష్మి, నాయకులు కె ఆదిలక్ష్మి, రత్నకుమారి, గండి లక్ష్మి, నూకాలమ్మ, ఏ లక్ష్మీ, రత్నకుమారి, పార్వతి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.