Oct 19,2023 23:44

చికిత్స పొందుతున్న రాజకుమారి

ప్రజాశక్తి - తెనాలి : రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ స్థానిక ఐతానగర్లో చేపట్టిన దీక్షా శిబిరాన్ని గురువారం సాయంత్రం ఆమె సందర్శించారు. దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. అనంతరం ఆమె శిబిరంలోనే అస్వస్థతకు గురై తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడున్న నాయకులను కోరారు. వెంటనే తెలుగు మహిళ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు ఆమెను ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.