Mar 09,2023 22:24

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
        మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, చట్టాలను కాపాడుకోవాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణి పిలుపు నిచ్చారు. గురువారం ఐద్వా, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా స్థానిక పాత మున్సిపల్‌ కార్యాలయం నుండి సభా ప్రాంగణం వరకూ మహిళలు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్‌కె.సుభాషిని అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్యఅతిథులుగా రమణి మాట్లడుతూ ప్రధానంగా మహిళలు వివక్షతతో సమానత్వం లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం లేకుండా దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం ఉపాధి హామీ ఎపిఒ శ్రీదేవి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు తామ ముత్యాలమ్మ, ఐసిడిఎస్‌ పిఒ ఎన్‌.స్వర్ణకుమారి, జంగారెడ్డిగూడెం ఐసిడిఎస్‌ పిఒ పి.బ్యూలా, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ కె.విజయలక్ష్మి, మొడియం నాగమణి, జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్‌, సిఐటియు పట్టణ అధ్యక్షులు, పి.సూర్యారావు. వంగా గోపి, ఎస్కే సుభాని, ఎ.ప్రభాకర్‌రావు, అంగన్‌వాడీ సెక్టార్‌ అధ్యక్షురాలు కె.విమల, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.