Sep 23,2023 19:29

మృతిచెందిన రుద్రవరం తిరుపతమ్మ

మహిళా దారుణ హత్య

ప్రజాశక్తి - బేతంచెర్ల

బేతంచెర్ల మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా రైల్వే స్టేషన్‌ ఆవరణంలో మహిళా దారుణ హత్యకు గురైంది. వివరాల మేరకు.. బేతంచెర్ల రైల్వే స్టేషన్‌ సమీపంలో నివస్తున్న రుద్రవరం తిరుపతమ్మ (45)ను గుర్తుతెలియని వ్యక్తులు తల, ముఖంపై బండరాళ్లతో మోది హత్య చేశారు. ఆదివారం నాడు స్థానికులు ప్రజలు రైల్వే స్టేషన్‌ ఆవరణంలో దుర్వాసన రావడంతో స్థానిక పోలీసులకు సమాచారము ఇవ్వగా బేతంచెర్ల పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై శివ శంకర్‌ నాయక్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపాల్‌ నాయక్‌ ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతమ్మ స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఉదయం పూట స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈమెకు మతిస్థిమితం సరిగా లేని కూతురు ఉంది.