Oct 07,2023 01:08

ప్రజాశక్తి - బాపట్ల
మహిళా జాగృతికి తమ రచనల ద్వారా చైతన్యపరచిన విదుషిమని కనుపర్తి వరలక్ష్మమ్మ అని ఫోరమ్ ఫర్ బెటర్ కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు. వరలక్ష్మమ్మ 127వ జయంతి సందర్భంగా ఫోరం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలవేసి శుక్రవారం నివాళులర్పించారు. తెలుగు సాహిత్య చరిత్రలో లేఖా సాహిత్యానికి శ్రీకారం చుట్టిన కవయిత్రి వరలక్ష్మమ్మ అన్నారు. తమ శారద లేఖల ద్వారా స్త్రీలను చైతన్యపరిచారని అన్నారు. మహిళలకు రాజకీయ చైతన్యాన్ని కలిగించారని అన్నారు. స్వాతంత్ర సమరంలో  భాగస్వాములుగా చేశారన్నారు. స్త్రీల కోసం బాపట్ల పట్టణం శీలంవారిపాలెంలో స్త్రీ హితైషిణి మండలి స్థాపించారని గుర్తు చేశారు. మహిళల కోసం  గ్రంథాలయాన్ని, విద్యాలయాన్ని నిర్వహించని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చేబ్రోలు సతీష్ బాబు పాల్గొన్నారు.