- దిశ పోలీస్ స్టేషన్లలో ఎస్‌పి తనిఖీలు
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్
కాకినాడ జిల్లా ఎస్‌పి ఎస్. సతీష్‌కుమార్ కాకినాడ నగరంలోని జిల్లా దిశ మహిళా పోలీస్ స్టేషన్లను బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దిశా పోలీస్ స్టేషన్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, బాధిత మహిళలు, బాలికల సమస్యలపై స్టేషన్ సిబ్బంది వ్యవహరించే పని తీరును ఎస్‌పికి దిశ పోలీస్ స్టేషన్ డిఎస్‌పి జయరాం ప్రసాద్ వివరించారు. అనంతరం ఎస్‌పి సతీష్‌కుమార్ మాట్లాడుతూ మహిళలు, బాలికల ఫిర్యాదు లపై తక్షణం స్పందించి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలతో న్యాయ స్థానాల ద్వారా వారికి కఠిన శిక్షలు పడేలా దిశ సిబ్బంది కృషి చేయాలని. పాఠశాలలు, కళాశాలలకు వెళుతున్న బాలికలు, యువతుల భద్రతకై పోలీసు శాఖ ద్వారా అమల్లో ఉన్న సేవలు, దిశా, ఫోక్సో చట్టాలు, ఈవ్‌టీజింగ్, ఎల్లో ప్‌మెంట్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలగు అంశాలపై మహిళా పోలీసుల యొక్క సేవలను ఉపయోగిం చుకుని విరివిగా అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్‌పి దిశ సిబ్బందిని ఆదేశించారు. దిశా పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఉండే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్, కాకినాడ జిజిహెచ్ ఆవరణలో ఉన్న దిశా వన్ స్టాప్ సెంటర్‌ను ఎస్పీ సందర్శించి ఈ కేంద్రాల యొక్క పనితీరును అక్కడి సిబ్బందితో మాట్లాడి మహిళలు, బాలికల రక్షణ విషయంలో మరింత మెరుగైన సేవలు అందించాలనారు. అనంతరం నిర్మాణంలో ఉన్న దిశా పోలీస్ స్టేషన్ భవనాన్ని, దిశా వన్ స్టాప్ సెంటర్ పక్కా భవన నిర్మాణాన్ని పరిశీలించి తక్కువ కాల వ్యవధిలో రెండూ నిర్మాణం పూర్తిచేసుకుని అందుబాటులోకి వచ్చేలా రోజువారీ జరుగుతున్న పనులను పర్యవేక్షించాలని దిశ డిఎస్‌పిని ఎస్‌పి సతీష్‌కుమార్ ఆదేశించారు. ఆయన వెంట దిశా స్టేషన్ పోలీసు అధికారుచలు సిబ్బంది, ఐసిడిఎస్ పీడీ ప్రవీణ, లీగల్, వైద్య విభాగాల అధికారులు పాల్గొన్నారు.
దిశ పోలీస్ అధికారులతో మాట్లాడుతున్న ఎస్‌పి సతీష్‌కుమార్










