కడప ప్రతినిధి ; మహిళల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, మధ్య వయస్కుల్లో రక్తహీనత కలిగిన మహి ళలకు అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నాం. రాష్ట్రప్రభుత్వం ఇటీ వల ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి విప్ల వాత్మక పథకాలతో ప్రజారోగ్యంలో విప్లవాత్మక పాత్ర పోషిస్తోంది. దీంతో ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన స్థాయిని పెంచుతోంది. ఇందులోభాగంగానే ఫ్యామిలీ డాక్టర్ సేవల్లో మండలానికి రెండు పిహెచ్‌సిలు, వైఎస్‌ఆర్ హెల్త్‌క్లినిక్స్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్య క్రమంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపశమ నం లభించనుంది. భవిష్యత్ రిక్రూట్‌మెంట్‌ల్లో ఎంపికైన దరఖాస్తు దారుల సర్టిఫికెట్లను యూనివర్శిటీ ఉన్నతాధికారుల పరిశీలన అనం తరం పారదర్శకంగా నియామకాలు చేపడతామని పేర్కొంటున్న రీజి నల్ డైరెక్టర్, స్త్రీ సంక్షేమశాఖ అదనపు డైరెక్టర్ కె.వి.ఎన్.ఎస్ అనిల్ కుమార్‌తో ముఖాముఖి...
మహిళా ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటి?
రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది గర్భిణులు ఉన్నారు. గర్భం దాల్చిన దగ్గర నుంచి బాలింత దశ వరకు వైద్య సహాయకుల నిరంతర పర్యవేక్షణలో 360 మందులు అందజేయడం జరుగుతో ంది. గర్భిణి దశలో 180, బాలింత దశలో 180 మందులను పం పిణీ చేస్తున్నాం. ఫలితంగా మహిళలు బాలింత జబ్బుల బారిన పడ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
అనీమియా వైద్యసేవలు వివరాలు తెలపండి?
రాష్ట్రంలో అనీమియా బారిన పడిన మహిళలపై ప్రత్యేక దృష్టి సారించడమైంది. విప్స్ ప్రోగ్రామ్ కింద ఐదేళ్ల బాలికల దగ్గర నుంచి మధ్య వయస్కుల వరకు మందుల దగ్గర నుంచి ఇన్‌జెక్షన్ దశ వరకు వివిధ రకాల వైద్య సేవలు అందించడం జరుగుతోంది. ఇందులో ప్రథమ దశలో ల్యాబెట్ల స్థాయిలో అధికగమించే ప్రయ త్నం చేస్తున్నాం. గర్భిణి దశలో రక్తహీనత ఎదురైతే కాన్పు అనం తరం రూ.3800 విలువతో కూడిన సింగపూర్, మలేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆధునిక ఇంజెక్షన్ల సహాయంతో సత్వ రమే రక్తంలో హీమోగ్లోబిన్ పెరుగుదలకు చర్యలు తీసుకుంటు న్నాం.
డయాగ్నోస్టిక్ ఫీజుల క్రమబద్దీకరణపై స్పందించండి?
డయాగ్నోస్టిక్ ఫీజుల క్రమబద్దీకరణ విషయంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విధానాన్ని ఎంపిక చేయడంపై దృష్టి సారించాం. టెస్టింగ్ రియాక్టర్స్ విషయంలో స్పష్టమైన అవగాహనకు వచ్చిన అనంతరం అమలు చేస్తాం. ఇందులోభాగంగా విజయవాడలో డ యాగ్నోస్టిక్ సెంటర్ భవనాన్ని ఏర్పాటు చేశాం. విజయవాడలోని ఫై లెట్ ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం.
జగనన్న సురక్ష ప్రయోజనాల్ని వివరించండి?
జగనన్న సురక్ష పథకంలో క్రానిక్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి జీవితాల్ని అతికష్టంగా లాగుకొస్తున్న వారికి ఎంతో ఉప శమనం లభిస్తుంది. ప్రతి పిహెచ్‌సి పరిధిలో 172 రకాల మందు లను అందుబాటులో ఉంచుతాం. గుండె సంబంధిత వ్యాధుల మం దులను సైతం అవసరమైన మేరకు అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుగుతోంది.
ఫ్యామిలీహెల్త్ కాన్సెప్ట్‌పై మీ స్పందనేమిటి?
ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ ఉద్దేశం ఎంతో మంచిది. 30 నిమిషాల వ్యవధిలో ఆరోగ్య సేవలు అందుకునేందుకు అవకాశం ఏర్పడింది. డయా బెటిస్, హైపర్‌టెన్షన్ వంటి పలు రకాల వ్యాధులకు సంబంధించిన ప్రిస్కిప్షన్‌కు ఆర్నెళ్లపాటు ఆమో దనీయత ఉంటుంది. వీటితోపాటు అసాంక్రమిత వ్యాధులను సకాలంలో అదుపులో ఉంచుకునేందుకు అవకాశం ఉంది.
వైఎస్‌ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ పని తీరు ఎలా ఉంది?
రాష్ట్రవ్యాప్తంగా 10 వేల వైఎస్‌ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్, 542 యుహెచ్‌సిలున్నాయి.విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో కుటుంబ హెల్త్ డేటాను భద్రపరచడం జరుగుతుంది. ఫలితంగా వారికి భవిష్యత్‌లో ఎదురయ్యే వ్యాధులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి దోహదం చేస్తుంది.
నకిలీ సర్టిఫికెట్ల బెడద నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి?
జోన్-4లో నర్సింగ్ నియామకాల్లో నకిలీ సర్టిఫికెట్ల బెడద నివారణపై సీరియస్‌గా దృష్టి సారించాం. దరఖాస్తుల స్క్రీనింగ్ అనంతరం నిర్వహించనున్న కౌన్సిలింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థి సర్టిఫికెట్లను హెల్త్ యూనివర్శిటీ ఉన్నతాధికారుల సహకారం తీసుకుంటాం. యూనివర్శిటీ అధికారులు సర్టిఫై చేసిన అనంతరం నియామకాలు చేపడతాం. దీంతో నియామకాల్లో పారదర్శకతను తీసుకొస్తాం.
స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది?
సెప్టెంబర్ మూడవ వారంలో 94 స్టాఫ్‌నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఈనెల ఐదు నాటికి సుమారు 9,800 దరఖాస్తులను స్వీకరించడమైంది. ప్రస్తుతం దరఖాస్తుల స్క్రూటి దశ నడుస్తోంది. అక్టోబర్ చివరి నాటికి స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
జోన్-4 పరిధిలోని విభాగాలు, ఉద్యోగులు సంఖ్య ఎంత?
జోన్-4 పరిధిలో కడప, అన్నమయ్య, అనంతపురం, సత్య సాయి, కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో 3, 800 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎంపిహెచ్‌ఇఓ, ఎంపి హెచ్‌ఎస్, హెచ్‌ఇసి, ఎంఎల్‌హెచ్‌పి, సీనియర్, జూనియర్ అసిస్టె ంట్లు, తాజాగా ఫార్మసిస్టులను కూడా కలపడంతో విస్తృతి పెరిగింది. వీరందరి సర్వీసులు, రిక్రూట్‌మెంట్లు, బదిలీలు, వైద్య ఆరోగ్యానికి సంబంధిత స్కీముల అమలు తీరును పరిశీలన చేయాల్సి ఉంటుంది.నర్సింగ్ దరఖాస్తులపై నిశిత పరిశీలన
'సురక్ష'తో క్రానిక్ రోగులకు ఉపశమనం










