Mar 11,2023 01:29
డిఎంహెచ్‌వో విజయమ్మకు జ్ఞాపిక అందిస్తున్న రోటరీ క్లబ్‌

ప్రజాశక్తి-బాపట్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో పలువురు మహిళా అధికారులకు శుక్రవారం ప్రత్యేక మెమెంటోలు అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్‌ విజయమ్మ, సబ్‌ ట్రెజరీ అధికారి ఎన్‌ అనూరాధ, బాపట్ల మండల తహశీల్దార్‌ డి కవిత, డిటి కె శ్రీదేవి, వైద్యాధికారులు సౌజన్య, రోహిణి, రత్నశ్రీ, ప్రేమ పావని, ఆశాకిరణ్‌, డిఎస్‌ఒ మార్గరెట్‌, సిహెచ్‌వో పద్మావతి, ప్రమీల, రాజ్యలక్ష్మి, ఏఎస్‌ఐ సరోజిని, విఆర్‌ఒ లక్ష్మీ తిరుపతమ్మ, రెవెన్యూ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ అజీదా బేగం, సీతా భవాని, పి వెంకటరమణలకు జ్ఞాపికలు అందజేశారు. పలు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాపట్ల జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌ నారాయణ భట్టు, పరిశుద్ధరావు, ఇపి రావు, నవనీత, గోపీకృష్ణ పాల్గొన్నారు.