అభ్యర్థుల ఎత్తు కొలుస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు రేంజి పరిధిలో ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మహిళా అభ్యర్థులకు గురువారం స్థానిక పోలీసు పేరేడ్ గ్రౌండ్స్‌లో దేహదారుఢ్య పరీక్షలు ఐజి పాల్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అభ్యర్థులు గుంటూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ ఎ.ఆర్.దామోదర్, గుంటూరు అదనపు ఎస్‌పి సుప్రజ, నెల్లూరు అదనపు ఎస్‌పి హైమవతి పరీక్షలు నిర్వహించారు. ఎత్తు, బరువు, పరుగు, లాంగ్‌జంప్, హైజంప్ తదితర పరీక్షలు జరిగాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. మహిళా ఎస్సై అభ్యర్థులకు మహిళా అధికారుల పర్యవేక్షణలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐజి తెలిపారు.










