Sep 27,2023 23:40

మహిళ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌కు నేతత్వ అవార్డు


ప్రజాశక్తి - క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పూర్వపు ఎన్‌ ఎస్‌ ఎస్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌జె కాత్యాయనికి ఇంటర్నేషనల్‌ ఎన్జీవో క్రిషన్‌ ఫౌండేషన్‌ న్యూఢిల్లీ వారిచే 22- 23, గాను నేతత్వ అవార్డు బహు కరిం చారు. ఈ అవార్డు లభించి నందుకు యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య భారతి, రిజిస్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ రజనీ, ప్రొఫెసర్‌ కే. అనురాధలు ఎంబీఏ విభాగం అధ్యాపకులు ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య జె. కాత్యాయనిని అభినందించారు.