Jun 23,2023 22:59

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందని ఆమె మృతదేహంతో కాకినాడ గాంధీనగర్లో ఉన్న రమ్య హాస్పిటల్‌ వద్ద బాధితులు శుక్రవారం ఆందోళనకు దిగారు. చేతిలో ఉన్న స్టీల్‌ రాడ్‌ తీసేందుకు శక్ర చికిత్స నిమిత్తం యానాంకు చెందిన శీలం నాగమణి గాంధీనగర్‌లో రమ్య హాస్పిటల్‌ గత రాత్రి చేరారు. ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో వైద్యం వికటించి మహిళ మతి చెందింది. తమకు సంబంధం లేదంటూ మతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది అప్పగించారు. మహిళ కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ వద్ద నిరసన తెలిపారు. హాస్పటల్‌ యాజమాన్యం తమకు సంబంధం లేదని చెబుతోంది.