
ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్
చీరాలకు చెందిన మహిళ ఆర్టీసి బస్సులో పోగొట్టుకున్న హ్యండ్ బ్యాగును అందజేసి ఇంకొల్లు కంట్రోలర్ షేక్ బాబు తన నిజాయితీని నిరూపించుకున్నారు. పసుపులేటి రాధ చీరాల నుండి తిమ్మసముద్రం వస్తూ ఊరు వచ్చేసరికి దిగి పోయింది. తీరా బ్యాగు చూస్తే బస్సలో మర్చిపోయినట్లు నిర్ధారించుకుంది. వెంటనే ఇంకొల్లు ఆర్టీసి బస్సు కంట్రోలర్ బాబుకు సమాచారం అందించారు. దీంతో బస్సు వచ్చిన వెంటనే బస్సులో పరిశీలించగా హ్యాండ్ బ్యాగు బస్సులోనే ఉంది. దీంతో రాధకు సమాచారం అందించి బ్యాగును ఆమెకు అందించారు. బ్యాగులో వెండి వస్తువులు, నగదు ఉండటంతో రాధ ఊపిరి పీల్చుకుంది. బ్యాగును తనకు అందించిన కంట్రోలర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.