ప్రజాశక్తి-గజపతినగరం రూరల్ : మహాత్ముని అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు. స్థానిక వైసిపి కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ వేమలి ముత్యాలనాయుడు, జెడ్‌పిటిసి గారు తౌడు, మాజీ జెడ్‌పిటిసి మక్కువ శ్రీధర్, వైసిపి నాయకులు బెల్లాన త్రినాథరావు, మండల సురేష్, కరణం ఆదినారాయణ పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి మాజీ మంత్రి పడాల అరుణ, మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ, ఎంపిపి బెల్లాన జ్ఞాన దీపిక, జెడ్‌పిటిసి గార తవుడు నివాళులర్పించారు. 22 మంది పారిశుధ్య కార్మికులను ఎంపిపి, జెడ్‌పిటిసి ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరవ కొండమ్మ ఉపసర్పంచ్ కర్రీ రామనాయుడు పాల్గొన్నారు. పురిటిపెంటలో సర్పంచ్ ఎస్.విజయలక్ష్మి, ఉప సర్పంచ్ మండల సురేష్, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ కె.కిషోర్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ రావాడ సత్యనారాయణ.. గాంధీకి నివాళులర్పించారు.

కొత్తవలస : కొత్తవలస తహశీల్దార్, ఎంపిడిఒ కార్యాలయాల వద్ద గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నివాళులర్పించారు. కార్యక్రమంలో కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, పిఎసిఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ, సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు పాల్గొన్నారు.
మెంటాడ : మెంటాడ గ్రంథాలయంలో గాంధీ చిత్రపటానికి శాఖా గ్రంథాలయ అధికారి మరడాన త్రినాథరావు నివాళులర్పించారు. కార్యక్రమంలో గండ్రేటి అప్పారావు, మీసాల అప్పలనాయుడు, గోవింద, నాగరాజు పాల్గొన్నారు.
తెర్లాం : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి ఎంపిడిఒ ఎస్.రామకృష్ణ, పలు చోట్ల ఎంపిపి ఎన్.ఉమాలక్ష్మి, వైస్ ఎంపిపి సత్యనారాయణ నివాళులర్పించారు. పెరుమాళిలో పాత్ ఫౌండేషన్ ఆధ్వర్యాన గాంధీ జయంతిని నిర్వహించారు. గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ బెనర్జీ పాత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముప్పిడి వెంకటరమణను గ్రామస్తులు సన్మానించారు. పెరుమాలి, జగన్నాథవలస సర్పంచులు జి.వెంకట్రావు, అప్పల నరసింహరాజు పాల్గొన్నారు. అరసబలగ సర్పంచ్ కె.సాయిరాం గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. గ్రామంలో గ్రీన్ అంబాసిడర్లకు సన్మానం చేశారు.
లక్కవరపుకోట : శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎస్‌వి రమణ ఆధ్వర్యాన గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గాంధీ విగ్రహాన్ని జెసిఎస్ మండల ఇన్‌ఛార్జి యడ్ల కిషోర్ కుమార్ ఆవిష్కరించారు. తలారిలో వైసిపి మండల అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ, లక్కవరపుకోట ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎంపిపి గేదెల శ్రీనివాసరావు, ఎంపిడిఒ జ్ఞానేశ్వరరావు, ఎల్.కోట మాజీ సర్పంచ్ జామి అప్పలరాజు.. గాంధీ విగ్రహాలకు నివాళ్లర్పించారు.
బొబ్బిలి : పట్టణంలో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జెసి రాజు, వి.శ్రీహరి, ట్రెజరర్ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ చిత్రపటాలను వనమిత్ర అద్యక్షులు కె.కృష్ణదాసు చిన్నారులకు పంపిణీ చేశారు. మున్సిపల్, విద్యుత్తు శాఖ కార్యాలయంలో గాంధీ జయంతి నిర్వహించారు. గాంధీ చిత్రపటాలకు లోక్ సత్తా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్, జనసేన కార్యాలయంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి నివాళులర్పించారు.
వేపాడ : ఎంపిడిఒ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎంపిపి డి.సత్యవంతుడు, జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, వైసిపి మండల అధ్యక్షులు జగ్గుబాబు, ఎపిఒ ఆదిలక్ష్మి నివాళులర్పించారు.
నెల్లిమర్ల : జరజాపుపేట ఎంపిపి పాఠశాలలో సాధన యువజన సంఘం ఉపాధ్యక్షులు బెల్లాన వెంకటరావు, సభ్యులు మద్దిల ఉమా మహేశ్వరరావు, బొద్దల శ్యామ్ సుందర్, రాజమండ్రి రాంబాబు, పసుమర్తి వెంకటరమణ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో విసి ప్రశాంత్ కుమార్ మహంతి.. గాంధీజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్‌ఎస్ వర్మ పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. టెక్కలి గ్రామంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
గుర్ల: గుర్లలో గాంధీ చిత్రపటానికి నాయకులు మంత్రి వెంకటరమణ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు శెట్టి తవుడు, మంత్రి పైడినాయుడు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి, జిల్లా రహదారుల భద్రతా కమిటీ సభ్యులు మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జెడ్‌పిటిసి శీర అప్పల నాయుడు, వైసిపి నాయకులు పొట్నూరు సన్యాసి నాయుడు, వైస్ ఎంపిపి తిరుపతిరావు గాంధీ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మెరకముడిదాం: మండలంలోని పెద్దమంత్రిపేట ఎస్ ఇండియా ఆధ్వర్యంలో పెద్దమంత్రిపేట, బైరిపురంలో సోమవారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. బైరిపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహానికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పప్పల విజయకుమారి, పప్పల క్రిష్ణ మూర్తి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఇండియా అధ్యక్షులు ఫార్మర్ ప్రొఫెషర్ డాక్టర్ హరశ్రీరాములు, పప్పల గ్రహణేశ్వరరావు, కెంగువ ధనంజయ, కందుల మళ్ళి ఖార్జునరావు, ఎస్ ఈశ్వరరావు, కందుల శ్రీను, ఎస్. వెంకటసత్యనారాయణ పాల్గొన్నారు.
విజయనగరం టౌన్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి. జనార్ధన నాయుడు ఆధ్వర్యాన గాంధీ జయంతి నిర్వహించారు.మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు.మహాత్మా గాంధీ ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉడా కాలనీఫేజ్ 3లో కాలనీ అసోసియేషన్, ఈవినింగ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఫేజ్ 3 పార్క్ లో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు గౌరీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దాత, వాకర్స్ సెక్రటరీ చిరంజీవ రావు, వాకర్స్ సెక్రటరీ నారాయణరావు, సభ్యులు జాన్ విక్టర్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ తిరుపతి నాయుడు, సోషల్ వర్కర్ జగన్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు.
పోలీసుశాఖ ఆధ్వర్యాన...
జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో శాంతియుత స్థాపనకు మహాత్ముడు చూపిన అహింసా మార్గం, సెక్యులరిజం ఆచరించాల్సిన మార్గాలన్నారు. ఎస్‌ఇబి ఎఎస్‌పి ఎస్.వెంకటరావు, డిఎస్‌పి ఆర్.గోవిందరావు, దిశ డిఎస్‌పి ఆర్.శ్రీనివాసరావు, ఎస్‌బి సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










